Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైరా'లో అతిథి పాత్రలో పవన్ కనిపించడం ఖాయమే!

  • గతంలో చిరూ సినిమాల్లో మెరిసిన పవన్ 
  • 'సైరా'లోను పవన్ కనిపించనున్నాడంటూ టాక్ 
  • అది నిజమేనంటూ అందుతోన్న సంకేతాలు  
చిరంజీవి .. పవన్ కల్యాణ్ లు ఒకేసారి తెరపై కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకి మించిన పండుగ మరొకటి ఉండదు. అభిమానుల ముచ్చట తీర్చడం కోసం, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' .. 'శంకర్ దాదా జిందాబాద్' లోను అన్నయ్యతో కలిసి పవన్ కల్యాణ్ సందడి చేశాడు. ఇక చిరంజీవి కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా తెరకెక్కబోతోన్న 'సైరా' సినిమాలోను పవన్ కల్యాణ్ కనిపించనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తోంది.

ఈ వార్త నిజమేననేది తాజా సమాచారం. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది .. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్ ను సంప్రదించగా .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అన్నయ్య పట్ల గల ప్రేమ .. చారిత్రక చిత్రాల పట్ల గల ఆసక్తి కారణంగానే పవన్ ఈ సినిమాలో చేయడానికి అంగీకరించాడని అంటున్నారు.      
chiranjeevi
pavan kalyan

More Telugu News